ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామానికి చెందిన తెదేపా సీనియర్ నేత, పుష్పగిరి దేవస్థానం మాజీ చైర్మన్, రెడ్యo లక్ష్మీరెడ్డి(70) బుధవారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందడo అత్యంత బాధాకరం, దురదృష్టకరమని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యo వెంకటసుబ్బారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్త పరిచారు. దుంపలగట్టు లోని ఆయన స్వగృహం లో మాజీ సర్పంచ్ రెడ్యo రామకృష్ణారెడ్డి, తెదేపా మండల మాజీ అధ్యక్షుడు రెడ్యo ఆదినారాయణ రెడ్డి, కేసీ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ రెడ్యo చంద్రశేఖర్ రెడ్డి లతో కలిసి రెడ్యo లక్ష్మి రెడ్డి పార్థివదేహం పై పుష్పగుచ్ఛం ఉంచి, శ్రద్ధాంజలి ఘటించి సంతాపాన్ని వ్యక్తపరిచారు.
కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మా చిన్నాయన మా చిన్న తనం నుండి తమ కోసం ఎన్నో త్యాగాలు చేశారని, జీవితాంతం మా తండ్రి కీర్తిశేషులు రెడ్యo( దుంపలగట్టు) సుబ్బారెడ్డి కాలం నుండి మా వెంబడే ఉన్నారని ఇలాంటి గొప్ప వ్యక్తి మరణించడం తాము జీర్ణించుకోలేకపోతున్నామని వాపోయారు. నీతి, నిజాయితీ, నిబద్దతకు మారు పేరుగా ఒకే మాట, ఒకే బాట, ఒకే పార్టీగా జీవించారని కొనియాడారు. మా చిన్నాయన లక్ష్మి రెడ్డి అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు జరుగుతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్యo లక్ష్మిరెడ్డి అల్లుళ్లు ఇండ్ల వెంకట్ రెడ్డి, మామిళ్ల సుబ్బారెడ్డి, కుమారుడు రెడ్యo వెంకటసుబ్బారెడ్డి, రెడ్యo నాగేశ్వరరెడ్డి రెడ్యo కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.