మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన నాతవరంలో వైయస్సార్ చేయూత పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. నాతవరం మండలానికి చెందిన 5357 మందికి మూడవ విడత 10 కోట్ల నాలుగు లక్షల రూపాయల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలందరికీ చేయూత పథకం వర్తిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సాగిన లక్ష్మణమూర్తి, జడ్పిటిసి అప్పలనర్స, మండల వైసీపీ అధ్యక్షులు పైల పోతురాజు పాల్గొన్నారు.