టీటీడీ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ నియంత్రణకు టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్రేక్ దర్శనాల సమయంలో ప్రయోగాత్మమైన మార్పును తీసుకువచ్చింది. ఉదయం 10 నుండి 12 గంటల వరకు బ్రేక్ దర్శనాలను కల్పించనుంది. తిరుమల గదులను కూడా తిరుపతిలోనే కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. రోజుకు 20వేల సర్వదర్శన టోకెన్లను జారీ చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ వెల్లడించారు.