అసిడిటీ సమస్యతో సతమతమయ్యేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆహారం తీసుకున్న వెంటనే కడుపులో మంటగా అనిపంచడం, పుల్లటి తేనుపులు రావడం, గుండె బరువుగా అనిపించడం, వికారం వంటివన్నీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలే. ఇది పెద్ద సమస్యే కానేకాదు అన్నట్టు కొంతమంది వ్యవహరిస్తుంటారు. కానీ గ్యాస్ ట్రబుల్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీవన విధానంతోపాటు ఆహార అలవాట్లులో స్వల్ప మార్పులు చేసుకుంటే ఎసిడిటీకి గుడ్‌బై చెప్పేయవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు. ఇంతకీ గ్యాస్ ట్రబుల్ సమస్యను ఎలా గుర్తించాలి? అసిడిటీ రావడానికి ముఖ్యమైన కారణాలేవి? అసిడిటీ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి కనీస అంశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహారం తీసుకున్న కొన్ని గంటలకు వికారంగా అనిపించినా, తల తిరుగుతున్నట్టు అనిపించినా, వామ్టింగ్ సెన్సేషన్ కలిగినా అది గ్రాస్ట్రిక్ ట్రబులే. ఎక్కువగా చెమటలు పడుతున్నా, గుండెల్లో మంట అనిపించినా జీర్ణ సమస్యలు తరచూ కనిపిస్తున్నా, మలబద్ధకం సమస్య ఉన్నా ఇవన్నీ ఎసిడిటీ లక్షణాలే. ఈ లక్షణాలు దీర్ఘకాలం ఉంటే తీవ్రమైన అసిడిటీగా భావించి కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి.
ఆహారం తీసుకున్న వెంటనే పడుకుంటే అసిడిటీ సమస్య కచ్చితంగా వస్తుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అలాగే.. అధిక బరువు ఉన్నా, ఆల్కాహాల్ తాగుతున్నా, సిగరెట్ అలవాటు ఉన్నా గ్రాస్ ట్రబుల్ సమస్య ఉత్పత్పమవుతుందట. మసాలా దట్టించిన స్పైసీ ఫుడ్ తిన్నా, రోజుకు మోతాదుకు మించి కాఫీ, టీలు తాగినా ఎసిడిటీ ప్రారంభమవుతుందట. నిద్ర పోయే ముందు ఆహారం తీసుకునే వారిలో యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అయి ఎసిడిటీ సమస్యలు వస్తాయట.
అసిడిటీ సమస్య రాకూడదన్నా లేక వచ్చిన వారైనా చిన్నచిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఆహారాన్ని నెమ్మదిగా, పూర్తిగా నములుతూ నిదానంగా తినాలి. నీరు ఎక్కువగా తాగాలి. రాత్రిళ్లు డిన్నర్ ముగిసిన వెంటనే వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. శరీర బరువును అదుపులో పెట్టుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్ మానేయాలి. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర పోవాలి.