తనపై చేసినట్లే జూనియర్ ఎన్టీఆర్పైనా దుష్ప్రచారం జరుగుతోందని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించినా, జిల్లాకు ఆయన పేరు పెట్టారని విమర్శించే వారు గుర్తెరగాలన్నారు. దీనిపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీ వారు టార్గెట్ చేశారన్నారు. తనకు వడ్డాణాలు, మంత్రి పదవులు అవసరం లేదన్నారు. ఎన్టీఆర్ భార్య అనే పేరే పెద్ద గౌరవం అన్నారు.