అనంతపురం జిల్లా గార్లదిన్నె సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ రామకోటి కాలనీకి చెందిన రఘువరరాజ తన భార్య,ఇద్దరు పిల్లలతో కలిసి లేపాక్షి ఆలయానికి వెళ్తుండగా గార్లదిన్నె సమీపంలో కారు అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొంది. దీంతో రెయిలింగ్ కారులోకి చొచ్చుకొచ్చింది. ఈ ప్రమాదంలో భార్య జయంతి, కూతురు కీర్తన అక్కడికక్కడే మరణించారు. రఘువరరాజు,కొడుకు సంకల్ప్ కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.