హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యఛేదనలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా విజయంలో సూర్యకుమార్ యాదవ్ (69), విరాట్ కోహ్లీ (63) కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. హైదరాబాద్‌లో టిక్కెట్ల కోసం ఎంత గొడవ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. కేవలం టిక్కెట్ల కోసమే ఇంత హంగామా జరిగితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని అందరూ కాస్త టెన్షన్ పడుతున్నారు. అయితే మ్యాచ్ ప్రశాంతంగా ముగిసింది. మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగినా.. అభిమానుల్లో కూడా అంతే ఉత్సాహం నెలకొంది. ఈ మ్యాచ్‌లో తొలి బంతికి స్టేడియంలో 32,459 మంది ఉన్నారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ పురోగమిస్తున్న కొద్దీ వారి సంఖ్య 45,004కు చేరుకుంది. రాత్రి 9.30 గంటలకు భారత్ ఇన్నింగ్స్ ప్రారంభం కాగానే స్టేడియంలో 45,354 మంది అభిమానులు ఉన్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా క్రికెట్ మ్యాచ్‌ను ఆస్వాదించారు.