ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా నెగ్గి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ క్రీడాభిమానులకు నిజమైన క్రికెట్ మజాను అందించింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ విజయంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అయితే ఈ విజయం నేపథ్యంలో డగౌట్ ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ కోహ్లీ సంబరాలు ఆకట్టుకున్నాయి. చివరి ఓవర్‌లో 11 పరుగులు కావాల్సిన సమయంలో కోహ్లీ (63) తొలి బంతికే సిక్సర్ కొట్టి సమీకరణాన్ని సులభతరం చేశాడు. కానీ తర్వాతి బంతికే ఔటయ్యాడు. ఆ సమయంలో రోహిత్ డగౌట్ ముందు స్టెప్పులపై నిలబడి విరాట్‌ను అభినందించాడు. తర్వాత ఇద్దరూ మెట్లపై కూర్చుని చివరి ఓవర్ వీక్షించారు. టీమ్ ఇండియా గెలవగానే ఆనందంతో ఊగిపోయి ఒకరినొకరు కౌగిలించుకున్నారు. రోహిత్‌ని దగ్గరకు తీసుకున్న కోహ్లీ మెచ్చుకోలుగా కనిపించాడు. ఇప్పుడు వీరిద్దరూ సంబరాలు చేసుకున్న వీడియో వైరల్‌గా మారింది. కాగా, ఆసీస్ నిర్దేశించిన 187 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించిన టీమిండియా.. మూడు టీ20ల సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది.
What a movement #RohitSharma #KingKohli pic.twitter.com/mVIF7sjRX6
— ROHIT SHARMA EMPIRE (@ConnectWithCri1) September 25, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa