నాసా చేపట్టిన డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ విజయవంతం అయింది. నాసా ప్రయోగించిన వ్యోమనౌక గ్రహశకలం డైమోర్ఫోస్‌ను మంగళవారం కూల్చి వేసింది. భూమి నుంచి 11 మిలియన్ కిలోమీటర్ల దూరంలో 530 అడుగుల వెడల్పు గల గ్రహశకలం కూలిపోయింది. భూమికి చేరువగా వచ్చే గ్రహశకలాలను కూల్చి వేయడం, దారి మళ్లించడం ఈ మిషన్ ఉద్దేశం. ప్రపంచంలోనే తొలిసారి ఈ సాంకేతికతను పరీక్షించిన ఘనత నాసాకు దక్కింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.