గత కొన్నేళ్లుగా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని చూస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ గురువారం సాయంత్రం మరోసారి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. సమావేశం అనంతరం సచిన్ పైలట్ మాట్లాడుతూ, 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడమే ప్రాధాన్యత అని చెబుతూ, రాజస్థాన్‌లో జరిగిన సంఘటనల గురించి వివరంగా చర్చించినట్లు తెలిపారు.రాజస్థాన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సోనియా గాంధీ తీసుకుంటారని.. రాబోయే 12-13 నెలల్లో మా కృషితో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సచిన్ పైలట్ తెలిపారు.