ఉడకబెట్టిన మెంతికూర అజీర్ణం నుండి ఉపశమనం కలిగిస్తాయి. కీళ్లనొప్పులను నయం చేస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది. శ్వాస తీసుకోవడంలో అడ్డంకులు సరిచేస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఇవి కీలకం. పరోటాలు, చట్నీలు, టమాటా కూరల్లో మెంతి ఆకులను వేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వారంలో మూడు నాలుగు సార్లు మెంతికూరను తీసుకుంటే సమస్యలు తగ్గుతాయి.