నవరత్నాలు, భాగంగా పేదలందరికీ ముఖ్యంగా ఇళ్లు నిర్మించుకోలేని వారికి తామే 1. 80లక్షలతో ఇంటి నిర్మాణాలు చేపట్టి ప్రజలకు ఇస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా ఇప్పుడు అదనంగా 35000 వేల రూపాయలు వసూలు చేయడం ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇంచార్జ్ వేలూరు శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పులివెందుల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పులివెందులలో ప్రభుత్వమే అధికార పార్టీ లీడర్ కాంట్రాక్టు సంస్థ ద్వారా 1. 80 లక్షల వ్యయంతో ఇళ్ల నిర్మించి ఇస్తాము అని ఆర్భాటంగా ప్రకటనలు ఇచ్చి ఎలాంటి ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు లేకుండా ఇప్పుడు ఇంటి నిర్మాణ వ్యయం పెరిగిందని, ఒక్కో లబ్ధిదారుడు రూ. 35వేలు ఇవ్వాలంటూ వలంటీర్లు లబ్ధిదారులకు చెబుతుండడం పట్ల అంతర్యం ఏమిటో అధికారులు ప్రజలకు వివరణ ఇవ్వాలని అన్నారు.
మా దగ్గరే డబ్బుంటే. మేమే కట్టుకునేవారం కదా అంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికారులు. ఈ నిర్ణయం మీద ప్రజల మీద భారం పడకుండా పునరాలోచించుకోవాలని లేని పక్షంలో ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.