ఉత్తరప్రదేశ్ లో ఆదివారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. భదోహిలో దుర్గమ్మ మండపం వద్ద జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలు మరణించారు. పూజలు చేసి హారతి ఇస్తుండగా మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు మండపం మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో 64 మంది గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.