యడ్లపాడు లూథరన్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో 4 న పల్నాడు జిల్లా టెన్నిస్ బాల్, క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 14 విద్యార్థులకు జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు, జిల్లా జట్టు ఎంపిక నిర్వహిస్తామని టెన్నిస్ బాల్, క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి. కె. రావు తెలిపారు. ఎంపికైన జట్టు అక్టోబర్ 8, 9 తేదీలలో నెల్లూరులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాలని వెల్లడించారు.