భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుస్థిరంగా సుభిక్షంగా ఉంచే శక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి కి మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సోమవారం ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని 17వార్డు పూజారిపేట వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు సీఎం జగన్మోహన్ రెడ్డి సుభిక్ష పాలనను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ని మళ్ళీ ఆశీర్వదించేందుకు అఖిలాంధ్ర ప్రజానీకం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి వార్డు లో ప్రతి ఇంటింటికీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పధకాల లబ్ధిని, కలిగే ప్రయోజనాలను వివరించే బాధ్యత ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త పై ఉందన్నారు.
గత మూడేళ్లలో మండలం లో ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ధిని ప్రజానీకం ముందు ఉంచేందుకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సీఎం రూపకల్పన చేశారన్నారు. వార్డులో ఉన్న సమస్యలను ఇంటింటికి వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న నవరత్నాలు పథకాలు తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. వాటి వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. వార్డులో ఎవరికైనా, ఎట్లాంటి సమస్యలు ఉన్నా వాటిని సంబంధిత అధికారుల ద్వారా తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పథకాల అమలులో మరింత సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించడమే లక్ష్యంగా 'గడప గడప కు మన ప్రభుత్వం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పించే విధంగా చివరి లబ్దిదారునికి కూడా పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని వారి నుంచే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. మూడేళ్లలో ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా చేకూర్చిన ప్రయోజనాన్ని ప్రజలకు వివరిస్తున్నామని ఒక్కో సచివాలయం పరిధిలో రెండు రోజులపాటు పర్యటించి ప్రతి ఇంటి గడపకూ ప్రభుత్వ ప్రయోజనాలను పూర్తిగా వివరించి వారి సమస్యలు తీర్చడం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలన్నింటినీ సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. సీఎం జగన్ అహర్నిశలు కృషి చేయడం అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గ్రామస్థాయి వరకు తీసుకువెళ్లి సకాలంలో ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డేపల్లి రమేష్ కుమార్, వార్డ్ ఇంచార్జ్ బొడ్డేపల్లి సుశీలమ్మ, స్థానిక నాయకులు బొడ్డేపల్లి జోగారావు, పొన్నాడ చిన్నారావు దుంపల శ్యామలరావు, దుంపల చిరంజీవి, మామిడి ప్రభాకర్ రావు , మామిడి రమేష్ కుమార్, మరియు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు