ఇద్దరు నిందితులు ఏకంగా మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సంతకం ఫోర్జరీ చేశారు. నల్సపరాకు చెందిన శుభమ్ వర్మ, జతిన్ పవార్‌లు ప్రభుత్వ ఈ-పోర్టల్‌లో భాగస్వామ్యం ఇప్పిస్తామని వ్యాపారి గోపానిని నమ్మించారు. విడతల వారీగా రూ.1.31 కోట్ల డబ్బు తీసుకుని, సీఎం ఫోర్జరీ సంతకంతో కూడిన పత్రాలను వ్యాపారికి ఇచ్చారు. బాధితుడు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa