రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఇరగవరం మండలం పరిషత్ కార్యాలయం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు వృద్ధులు వితంతువులకు నూతనంగా మంజూరైన పెన్షన్లను అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.