భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ) అక్టోబరు14 నుండి18వ తేదీ వరకూ విజయవాడలో జరుగుతున్న సీపీఐ పార్టీ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి కోరారు.
శ్రీకాకుళం మండలం పాత్రునివలస గ్రామంలో డి. హెచ్. పి. ఎస్. ఆధ్వర్యంలో సీపీఐ పార్టీ జాతీయ మహాసభలకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్ల గోపి, ఏ. ఐ. టి. యు. సి. జిల్లా ప్రధాన కార్యదర్శి అనపానషణ్ముఖ రావులు మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీన వర్గాల సమస్యలపై కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాటాలు చేసి అనేక హక్కులను సాధించిందని అన్నారు. వందేళ్ళు పోరాటాలు చేసి సాధించుకున్న కార్మికుల, కష్ట జీవుల, రైతులు, ఉద్యోగులు, మహిళలు, యువజనుల హక్కులను కాల రాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. అక్టోబరు14వ తేదీన విజయవాడలో జరిగే ప్రదర్శనలో ఉపాధి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, రైతులు, మహిళలు, విద్యార్థి , యువజనులు, ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి కరపత్రములు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ. ఐ. టి. యు. సి. ముఖ్య సలహాదారు చిక్కాల గోవింద రావు, డి. హెచ్. పి. ఎస్. జిల్లా ఉపాధ్యక్షులు బలగ రామారావు, ముదిదాన భాస్కరరావు, బలగ గణేష్, తుడుం గణేష్, బి. వరలక్ష్మీ, బి. లావణ్య, పెంటల నీలవేణి, కారిగ్గి దయామణి, నీలమ్మ, ఎం. వరహాలమ్మ, ఏ. ఐ. టి. యు. సి. నాయకులు పంచిరెడ్డి అప్పారావు, ఉప్పాడ సూర్యనారాయణ, చుక్క సూర్యం తదితరులు పాల్గొన్నారు.