ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రాజధానిగా జరిగిన నష్టాన్ని మరోసారి జరగనీయకూడదనే అభివృద్ధి వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఎంపిపి ఆరంగి మురళీధర్ అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వ సభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదేళ్లు ఉమ్మడి రాజధాని కాదని భయంతో పారిపోయి తాత్కాలిక రాజధానికి వేల కోట్లు వృధా చేసి చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోయారని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలను అవమానించేలా పాదయాత్ర చేస్తున్న పెయిడ్ ఆర్టిస్టులకు బుద్ది చెప్తామని అన్నారు. పారదర్శక పాలన అందించి, మేనిఫెస్టోలో హామీలు 98 శాతం ఇప్పటికే అమలు చేసిన జగన్ మోహన్ రెడ్డి మరోసారి సీఎం కావడం ఖాయమని స్పష్టం చేశారు. అనంతరం మండలంలోని పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీఓ మధుసూదన రావు, తహాసిల్దర్ సింహాచలం, ప్రజాప్రతినిధులు పోలాకి నర్సింహ మూర్తి, ప్రభాకరరావు, యాళ్ళ కృష్ణం నాయుడు, పాగోటి రాజారావు, బొబ్బది ఈశ్వరరావు, సీహెచ్. వెంకట రమణ తదితరులు హాజరయ్యారు.