ఏపీలోని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. శనివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. 2018లో సీజ్ చేసి, స్టేషన్‌లో ఉంచిన పేలుడు పదార్ధాల వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. పేలుడు తీవ్రతకు స్టేషన్ అద్దాలు, కిటికీలు, తలుపులు ధ్వంసం అయ్యాయి. స్టేషన్ ఆవరణలోని వాహనాలు కూడా పేలుడు ధాటికి దగ్ధమయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa