కేరళలోని కోజికోడ్‌లో విస్మయకర ఘటన జరిగింది. 2017లో కోజికోడ్ మెడికల్ కాలేజీలో హర్షినా (30) మూడోసారి సిజేరియన్ చేయించుకుంది. ఆ సమయంలో రక్తస్రావ నాళాలను బిగించడానికి ఉపయోగించే ఫోర్సెప్స్‌ను ఆమె కడుపులో మర్చిపోయి కుట్లు వేశారు. ఐదేళ్లుగా ఆమె కడుపునొప్పితో బాధపడుతోంది. ఇటీవల స్కానింగ్‌లో ఫోర్సెప్స్ విషయం బయటపడింది. దానిని వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa