తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. కాంప్లెక్స్ లు నిండి బయట 4 కిలోమీటర్ల మేర లైన్ ఉంది. దీంతో ఉచిత దర్శనానికి రెండు రోజులు, రూ.300 దర్శనానికి 10 గంటల టైం పడుతుంది. మరో 4 రోజులు ఇదే పరిస్థితి ఉండనుంది. దీంతో తెల్లవారుజామున కొనసాగే వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్చారు. భక్తులకు నీరు,ఆహారాన్ని అందిస్తున్నారు. భక్తులు పరిస్థితికి అనుకూలంగా రావాలని అధికారులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa