మహారాష్ట్ర థానేలోని కళ్యాణ్ ప్రాంతంలో తప్పుడు సోనోగ్రఫీ నివేదిక ఆధారంగా అబార్షన్ మాత్రలు ఇవ్వడంతో 28 ఏళ్ల గర్భిణి మరణించింది. శిశువు ఎదుగుదల సరిగా లేదని సోనోగ్రఫీ నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా అబార్షన్ పిల్స్ ఇవ్వడంతో గర్భిణీ మృతి చెందింది. సోనోగ్రఫీ తప్పుడు నివేదిక వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఈ కేసులో ప్రమేయమున్న వ్యక్తులపై పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.