ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నేత అనిల్ దేశ్‌ముఖ్‌కు మంజూరైన బెయిల్‌ను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. బెయిల్‌కు మాత్రమే పరిమితమని ధర్మాసనం స్పష్టం చేసింది.మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దేశ్‌ముఖ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఈడీ దర్యాప్తు చేస్తున్న మనీలాండరింగ్ కేసులో అక్టోబర్ 4న బాంబే హైకోర్టు దేశ్‌ముఖ్‌కు బెయిల్ మంజూరు చేసింది.సుప్రీంకోర్టులో ఈడీ అప్పీలు చేసుకునేందుకు వీలుగా బెయిల్ ఆర్డర్ అక్టోబర్ 13 నుంచి అమల్లోకి వస్తుందని హైకోర్టు ఆదేశించింది.