తమిళనాడులోని చెన్నై అంబత్తూరులో ఇంటర్ సెకండియర్ చదువుతున్న 17 ఏళ్ల విద్యార్ది ట్యూషన్ కు వెళ్లేవాడు. ట్యూషన్ టీచర్ షర్మిలతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇటీవల టీచర్ కు వేరే వ్యక్తితో ఎంగేజ్ మెంట్ అయ్యింది. టీచర్ దూరం పెట్టడంతో విద్యార్ది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.