కేరళ నరబలి హత్య అంశం ఇపుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. కేరళ నరబలి హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నరబలి కోసం ఫేస్‌బుక్‌లో నకిలీ పేరుతో ఇద్దరు మహిళల్ని ట్రాప్ చేసిన నిందితుడు మహ్మద్ షఫీ.. లాటరీ టిక్కెట్లు అమ్ముకునే పద్మం, రోస్లీ అనే మహిళలను మరో ఇద్దరితో కలిసి హత్యచేసిన విషయం తెలిసిందే. ప్రధాని నిందితుడు మహ్మద్ షఫీ గతంలో ఓ 75 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. మధ్యలో చదువు మానేసిన షఫీ.. నేర చిట్టా గురించి పోలీసులు వెల్లడించారు. నరబలి ఇచ్చిన ఇద్దరు మహిళల్ని పోర్న్ సినిమాల్లో నటిస్తే డబ్బులు వస్తాయని ఆశచూపాడు. అదే సమయంలో భగవల్ సింగ్, లైలా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే నరబలి ఇవ్వాలని సలహా ఇచ్చాడని పోలీసులు తెలిపారు.
సెక్స్ బానిసగా మారిన షఫీ క్రూరంగా ప్రవర్తిస్తుంటాడని కోచి డీసీపీ సీహెచ్ నాగరాజు తెలిపారు. పద్మంను షఫీ హత్య చేసి తల, మొండెం వేరుచేసిన తర్వాత 56 ముక్కలు చేశాడని, కొంత భాగాన్ని ఓ బకెట్లో ఉంచాడని చెప్పారు. రోస్లీని లైలా చంపి, ఆమె వక్షోజాలను కత్తిరించింది. ‘‘గతంలో షఫీ మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.. నరబలి, నరమాంస భక్షణ కోసం మహిళలను సరఫరా చేశాడు’’ అని సీపీ వివరించారు. మహిళల్లో ఒకరిని కత్తితో చిత్రహింసలకు గురిచేసిన, నరమాంసం తినట్లు దర్యాప్తులో తేలింది. వృద్ధురాలిపై అత్యాచారానికి షఫీ ప్రయత్నించాడన్న ఆరోపణలను కూడా పోలీసు కమిషనర్ ప్రస్తావించారు. ఆమె ఒంటిపై గాయాలు కూడా అలాంటివేనని సీపీ చెప్పారు.
కోచిలోని ఎలాముకులానికి చెందిన పద్మం (52), కాలడీకి చెందిన రోస్లీ (50) లాటరీ టిక్కెట్లు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 6న రోస్లీ, సెప్టెంబరు 26న పద్మం కనిపించకుండా పోయారు. పద్మం కుమారుడు తన తల్లి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆచూకీ కోసం సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లు, కాల్ రికార్డులను పరిశీలించగా.. కోచి నుంచి తిరువళ్లకు ఓ వ్యక్తి కారులో తీసుకెళ్లినట్టు గుర్తించారు. ఫోన్ నెంబరు ఆధారంగా అతడ్ని పాత నేరస్థుడు మహ్మద్ షఫీ అనే వ్యక్తిగా ట్రేస్ చేసి అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
ఇదిలావుంటే తనతో శృంగారంలో పాల్గొంటే రూ.15 వేలు ఇస్తానని ఒకరిని, నీలి చిత్రాల్లో నటిస్తే రూ.10 లక్షలు ఇస్తానని మరొకరిని షఫీ నమ్మించిన తనతో రప్పించుకున్నాడు. ఆపై సింగ్-లైలా దంపతులతో కలిసి ఒకే రోజు ఇద్దర్నీ బలి ఇచ్చాడు. రషీద్ సూచనల మేరకు పద్మను 5 ముక్కలు, రోస్లిన్‌ను 56 ముక్కలుగా చేసినట్లు తెలిసింది. ఆ శరీరభాగాల్లో కొన్నింటిని వండుకుని ముగ్గురూ తిన్నట్లు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa