ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నోట్ల రద్దుపై న్యాయసమీక్ష చేపడతాం: సుప్రీం కోర్టు

national |  Suryaa Desk  | Published : Fri, Oct 14, 2022, 12:06 AM

నోట్ల రద్దు నిర్ణయంపై న్యాయసమీక్ష చేపడతామని సుప్రీం కోర్టు వెల్లడించింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016 నవంబరులో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ నిర్ణయాల విషయంలో తమ పరిధి ఏంటో తెలుసని, కానీ, దీనిపై న్యాయసమీక్ష చేపడతామని బుధవారం వ్యాఖ్యానించింది. ‘‘ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయ సమీక్షలో లక్ష్మణరేఖ గురించి మాకు తెలుసు.. అయితే ఈ సమస్య కేవలం విద్యాపరమైన అంశంగా మారిందో? లేదో నిర్ణయించడానికి 2016 నోట్ల రద్దు నిర్ణయాన్ని పరిశీలించాలని నిర్ణయించాం’’ ఈ మేరకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశాన్ని విస్తృత రాజ్యాంగ ధర్మాససం విచారిస్తుందని చెప్పింది.


పెద్ద నోట్ల రద్దు చట్టాన్ని సరైన దృక్కోణంలో సవాలు చేయని పక్షంలో సమస్య తప్పనిసరిగా విద్యాపరంగానే ఉంటుందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సమర్పించిన అఫిడ్‌విట్‌లో పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే అక్రమ నగదు బదిలీని అరికట్టేందుకు పెద్ద నోట్లను ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హై డిమోనిటైజేషన్ బ్యాంకు నోట్ల (డీమోనిటైజేషన్) చట్టం 1978లో ఆమోదం పొందింది.


ఈ నిర్ణయం అకడమిక్‌గా ఉందా? లేదా? అనేది ప్రకటించాలంటే ఇరుపక్షాలు అంగీకరించనందున సమీక్షించాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ‘‘ ఆ సమస్యకు సమాధానమివ్వడానికి అది విద్యాసంబంధమైందా? కాదా? లేదా న్యాయ సమీక్ష పరిధికి మించిందా? అనేది మనం విని సమాధానం ఇవ్వాలి.. కేసులోని అంశం ప్రభుత్వ విధానం, దాని విజ్ఞత.. ఇందులో ఇది ఒక ప్రధాన అంశం.. లక్ష్మణ రేఖ ఎక్కడ ఉందో మాకు ఎల్లప్పుడూ తెలుసు.. కానీ అది జరిగిన విధానాన్ని పరిశీలించాలి... నిర్ణయించుకోవడానికి మేము వాదనలు వినాలి’’అని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, ఏఎస్ బోపన్న, వి రామసుబ్రమణియన్, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.


కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. అకడమిక్ అంశాల గురించి కోర్టు తన సమయాన్ని వృథా చేసుకోరాదని అన్నారు. ఈ వాదనలను పిటిషనర్ తరఫు కౌన్సిల్, సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ తోసిపుచ్చారు. ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనం ముందు ఉంచాలని మునుపటి బెంచ్ చెప్పినందున రాజ్యాంగ ధర్మాసనం సమయం వృధా అనే పదాలను వాడటం తనకు ఆశ్చర్యం కలిగిందన్నారు.


పిటిషన్ల తరఫున హాజరైన మరో సీనియర్ న్యాయవది పి చిదంబరం.. ఇది అకడమిక్ అంశం కాదని, దీనిని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయిస్తుందని వివరించారు. ఒకవేళ ఇటువంటి నోట్ల రద్దు అవసరమైతే పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సి ఉంటుందని వాదించారు. నోట్ల రద్దు అంశంపై విచారణను 2016 డిసెంబరులో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్.. రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa