దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 969 పాయింట్ల లాభంతో 58,204 వద్ద, నిఫ్టీ 276 పాయింట్ల లాభంతో 17,290 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.20 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఆసియా-పసిఫిక్ సూచీలు కూడా లాభాల్లో ఉన్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు దిగొస్తున్నాయి.