మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా భామ్రాగర్ లోని గుండెనూర్ యువకులు చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు, యువకులు కలిసి వాగుపై వంతెన ఏర్పాటు చేసుకున్నారు. రాకపోకల కోసం ఇలా వంతెనలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వాగులో పిల్లర్ల కోసం వెదురు, బ్రిడ్జి కోసం కలప వినియోగించారు. ఈ వంతెన మీద నుంచి బైక్ లు, సైకిళ్లు వాడుతున్నారు. కానీ ఈ వంతెనపై భారీ వాహనాలకు అవకాశం వుండదు. ఈ వంతెనతో తమ కష్టాలు తీరాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఏపీలోని విజయనగరం, కడప జిల్లాలోనూ ఇదే తరహా వంతెనలు ఏర్పాటు చేసుకుంటున్నారు.