ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుబాయిలో తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం కార్యకర్తల సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 17, 2022, 10:19 AM

కష్టాల్లో కూరుకుపోయిన  రాష్ట్రం ఏదైన ఉందీ అంటే అది ఆంధ్రప్రదేశ్ అనే దుస్థితికి రాష్ట్ర పరిస్ధితి చేరుకోంది’అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు గొల్లపల్లి సూర్యరావు వాపోయారు. కనీస వసతుల కల్పనలో విఫలం కావడానికి తోడుగా కూల్చివేత చర్యలతో కొనసాగుతున్న విధ్వంసకర పాలన తుది దశకు చేరుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం దుబాయిలో తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం ఏ ఒక్క నిర్మాణాత్మక కార్యక్రమం గానీ కట్టడం గానీ చేపట్టలేకపోయిందనే విషయాన్ని గుర్తించాలన్నారు. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలలో అభిమానం, సానుభూతి ఉందన్నారు. దీన్ని ఓట్ల రూపంలో మలుచుకోవడానికి విదేశాలలోని కార్యకర్తలు కృషి చేయాలని సూర్యరావు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడును మళ్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించే వరకు ప్రతీ కార్యకర్త నిర్విరామంగా కృషి చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com