ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం తూర్లలక్ష్మీపురం లో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే...తూర్లలక్ష్మీపురం కి చెందిన పవన్‌కల్యాణ్ (24) , గొడుగుపేటకు చెందిన శ్యామల(18) ప్రేమించుకున్నారు. కులాలు వేరుకావడంతో వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. మనస్తాపానికి గురైన శ్యామల జూన్ 5న ఆత్మహత్య చేసుకుంది. పవన్ ఈ నెల 15 రాత్రి స్నేహితులతో కలసి పార్టీ చేసుకున్నాడు. ఆ తర్వాత అతడి ఆచూకీ లేకుండాపోయింది. శ్యామల సమాధికి సమీపంలో మరో సమాధి లాంటి ఆనవాళ్లను జంగారెడ్డిగూడెం పోలీసులు గుర్తించారు. దీంతో కలకలం రేగింది. పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ ప్రాంతంలో మంగళవారం తవ్వకాలు చేపట్టనున్నట్టు పోలీసులు తెలిపారు.