నేడు కడపలో పర్యటించినట్లు నారా లోకేష్ తెలియజేసారు. ఆ సందర్భంగా అయన మాట్లాడుతూ.... కడప జిల్లా ముఖ్య నాయకులు, ఇంఛార్జులతో సమావేశం అయ్యి తాజా రాజకీయ పరిణామాల పై చర్చించాం. పార్టీ బలోపేతం కోసం తీసుకోవలసిన చర్యల గురించి మాట్లాడుకున్నాం. అనంతరం కడప సెంట్రల్ జైలు కి వెళ్లి ప్రొద్దుటూరు టిడిపి ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ని పరామర్శించాను. ప్రవీణ్ ఇంటి పై దాడి చేసింది వైసిపి రౌడీలు అయితే, పోలీసులు ప్రవీణ్ పై హత్యాయత్నం కేసు పెట్టి, అరెస్ట్ చెయ్యడం దుర్మార్గం. ప్రవీణ్ కి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. నా పర్యటన కు పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు అని తెలియజేసారు.