పవన్ కల్యాణ్ పొలిటికల్ బ్రోకర్లా వ్యవహరిస్తున్నాడని, చంద్రబాబు స్నేహంతో పవన్‌కి కూడా మతిమరుపు రోగం వచ్చినట్టుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరో కావొచ్చు కానీ, రాజకీయాల్లో మాత్రం జీరో అని అన్నారు. మూడు రాజధానులకు ఓకే చెప్పిన నోటితోనే.. వికేంద్రీకరణను పవన్ వ్యతిరేకిస్తున్నాడని గుర్తుచేశారు. నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పవన్‌కు రాజకీయ విలువలు, నిబద్ధత లేవు కాబట్టే పోటీ చేసిన రెండు చోట్ల ఓడించారని, పవన్‌ను ప్యాకేజీ స్టార్‌గా రాష్ట్ర ప్రజలు ఎప్పుడో గుర్తించారన్నారు. నారా వారి రాజ్యాంగంలో విశాఖ ఎయిర్‌పోర్టులోనే ప్రతిపక్షంలో ఉన్న వైయస్ జగన్‌ని పోలీసులు అడ్డుకున్నారని, ప్రస్తుతం రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలులో ఉంది కాబట్టే పవన్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడన్నారు.