ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్న బిడ్డను కడతేర్చాలని చూసిన కసాయి తండ్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 18, 2022, 07:55 PM

ముక్కుపుచ్చలాడని పసిపాపని నీటి కుంటలో పడేసిన వైనం చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటుచేసుకుంది. పుంగనూరు కోనేటి పాలెంకు చెందిన అయ్యప్ప (29) సంవత్సరాలు రెడ్డమ్మ (23) సంవత్సరాలు గత ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇరువురు సంతానం. మొదటి బిడ్డ హర్ష(5) రెండవ సంతానంగా హర్షిత 1సంవత్సరం6 నెలలు. అయ్యప్ప తాగుడుకు బానిసై భార్య రెడ్డమ్మతో గొడవ పడుతూ భార్య మీద కోపంతో ఇంటి వద్ద మంగళవారం ఎవరూ లేని సమయంలో తన కన్న బిడ్డను కడతేర్చాలని అనుకున్నాడు. ఆవేశంలో పుంగనూరు మంగళం కాలనీ వద్ద గల చెరువు నీటి కుంటలో పాపను పడవేస్తుండగా అటుగా ఆటోలో వెళుతున్న ఆటో డ్రైవర్ లు ఇద్దరు వ్యక్తులు గమనించి నీటి గుంటలో పడవేసిన పాపను రక్షించి పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. సరైన సమయానికి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు రావడంతో వైద్యులు చికిత్స అనంతరం పాప ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని వెల్లడించారు. పాపను కడతేర్చాలన్న కసాయి తండ్రి పై తన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com