విజయవాడలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు బాబు మాట్లాడారు. వైసీపీ లాంటి నీచమైన పార్టీని తన జీవితంలో చూడలేదని విమర్శించారు. 40 ఏళ్లలో ఎన్నడూ చూడని రాజకీయాలు చూస్తున్నానని అన్నారు.అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, అందరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే తక్షణ కర్తవ్యం.అందుకే పవన్ కల్యాణ్‌కి కూడా విజ్ఞప్తి చేశాను . అందరం కలిసి ప్రజాస్వామ్యం కోసం కలిసి పోరాడుదాం.. ఇదే.. ‘‘ఈ విషయంపై పవన్‌తో చర్చించాను అని చంద్రబాబు తెలిపారు.