పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ శివశంకర్ లోతేటి ఐఏఎస్ ,ఎమ్మెల్యే గోపిరెడ్డి.శ్రీనివాస రెడ్డి నరసరావుపేటలోని స్థానిక మునిసిపల్ క్రీడా మైదానం నందు పోలీస్ అమరవీరుల దినం -2022 ను నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాల గురించి శ్రీ ఎస్పీమాట్లాడుతూ..అక్టోబర్ 21, అంటే పోలీసు అమరవీరుల దినం. 1959 చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా తిప్పిగొట్టిన రోజు ఇది. ఈ సమరంలో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ యోధుల త్యాగాలను స్మరించుకుంటూ,అక్టోబర్ 21 తేదీని అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరువుకుంటున్నాం అని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa