వైద్య, విద్య ఆరోగ్య శాఖ అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల పని చేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేస్తానని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టుకోలేదని ఏఐటియుసి నాయకులు తాటిపాక మధు విమర్శించారు. శనివారం ఉదయం స్థానిక ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి ముందు ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమం జరిగింది. సుమారు గంటసేపు ఆస్పటల్ ఆవరణ వద్ద నిరసన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మధు మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేశారని ఆయన అన్నారు. అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి కూడా ఆప్కాస్ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మిట్ చేయాలన్నారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆయన తెలియజేశారు.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ వైద్యరంగం పట్ల ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలో ఉన్న 28 డిమాండ్స్ను తక్షణమే పరిష్కరించాలని, పెరుగుతున్న జనాభా కనుగొనగా ప్రభుత్వ సామాన్య ఆస్పత్రులలో, బోధన ఆసుపత్రులు, సామాజిక ఆసుపత్రిలో, ఏరియా ఆసుపత్రిలో, వైద్య విధాన జిల్లా పరిషత్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్ చేసి అదనపు సిబ్బందిని నియమించాలని ప్రసాద్ అన్నారు. ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ స్వామి బాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఐదు రోజులపాటు కాకినాడ జిల్లాలో వైద్య ఉద్యోగుల సమస్యలపై నిరసన వ్యక్తం చేసామని, మా సమస్యల తక్షణమే పరిష్కరించాలని, లేకుంటే భవిష్యత్తు ఆందోళన కార్యచరణ చేపడతామని ఆయన అన్నారు.
కాకినాడ బ్రాంచ్ అధ్యక్షులు కే. మోహన్ మాట్లాడుతూ సీనియార్టీ ప్రకారంగా ఎఫ్ ఎన్ ఓ, ఎం ఎన్ ఓ, ఫామిస్ట్, రేడియాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర రంగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పదోన్నతులు కల్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వి. ప్రసన్నకుమార్, వి. సత్యనారాయణ, జె. డేవిడ్రాజు, కే. పరమేశ్వరి, ఎస్. కే. అలీషా, ఎస్. రాజబాబు, కే. పండు, అస్సార్ హుస్సేన్, పి ఎస్ నారాయణ, సెక్యూరిటీ గార్డ్స్ అనిల్ ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సెక్యూరిటీ గార్డ్స్ తదితరులు పాల్గొన్నారు.