ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. అజ్ఞానంపై ‘జ్ఞానం’.. దుష్ట శక్తులపై ‘దైవశక్తి’.. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో విరాజిల్లాలని సీఎం అభిలషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa