ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా మధ్యాహ్న భోజనంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి ఐదు ఉడికించిన కోడి_గుడ్లను అందజేస్తున్నారు. కోడిగుడ్లు అక్రమార్కుల పాలవ్వకుండా కోడిగుడ్లపై ప్రతి వారం ఒక్కో రంగు వేసి సరఫరా చేస్తున్నారు. నెలలో మొదటి వారం నీలం, 2వ వారం గులాబీ, 3వ వారం ఆకుపచ్చ, 4వ వారం వంగపువ్వు రంగులో కోడిగుడ్లపై స్టాంపింగ్ చేస్తారు. ఈ విధంగా వచ్చే కోడిగుడ్లను మాత్రమే ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లో దిగుమతి చేసుకోవాల్సి ఉంది. గుడ్డు పరిమాణం తగ్గినా పాఠశాలల్లో తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.