మడకశిర: మడకశిర నగర పంచాయతీలోని హరి ఇండిస్టీస్ కు చెందిన వ్యాపారి ఆస్తిపన్ను చెల్లించలేదన్న సాకుతో మున్సిపల్ అధికారులు దుకాణంలోని సరుకులు ట్రాక్టర్లో వేసుకొని వెళ్లడానికి యత్నించారు. విషయం తెలుసుకున్న పట్టణంలోని పలువురు వ్యాపారులు కాంట్రాక్టర్లు వెళ్లి కమిషనర్‌ను నిలదీశారు. నగర పంచాయతీలో 260మంది కి పైగా ఆస్తి పన్ను చెల్లించాల్సుంటే వారి జోలికి వెళ్లకుండా కేవలం వ్యాపారులపై ఇలా దౌర్జన్యం చేసి వారిని భయాందోళనకు గురిచేయడం సమంజనం కాదని అన్నారు. మూడు సంవత్సరాలగా కరోనా మూలంగా వ్యాపారాలు జరగలేదని, దానికి తోడు కుటుంబసమస్యల కారణంగా పన్ను చెల్లింపులో ఆలస్యమైందని అన్నారు. అయినప్పటికీ గత రెండు నెలల నుంచి దాదాపు 70 వేల రూపాయల వరకు వడ్డీతో కలిపి ఆస్తి పన్ను చెల్లిస్తూ వస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ అధికారులు ఇలా దౌర్జన్యం చేయడం సరికాదని హరి ఇండిస్టీస్ యజమానులు మంజునాథ్, హరినాథ్ బాబు అన్నారు. ఒకవేళ తాము పన్నులు చెల్లించకపోతే నోటీసులు ఇచ్చి కోర్టులో తమపై కేసు వేయాలే తప్ప ఇలా వీధుల్లోకి వచ్చి వ్యాపారులపై దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసం ప్రశ్నించారు. దీంతో కమిషనర్, ఇతర అధికారులు అక్కడినుంచి వెళ్లిపోయారు.