వాట్సాప్ సేవలకు ఈ నెల 25న భారత్ సహా పలు దేశాల్లో దాదాపు 2 గంటల పాటు అంతరాయం ఏర్పడి యూజర్లు ఇబ్బంది పడ్డారు. కాసేపటికి సమస్య పరిష్కారమైంది. గతంలోనూ పలుమార్లు వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడినా ఈ స్థాయిలో ఇదే తొలిసారి. కలిగిన అసౌకర్యానికి వాట్సాప్ క్షమాపణ చెప్పింది కానీ, కారణాలు వెల్లడించలేదు. దీంతో ఈ వ్యవహారంపై దృష్టిసారించిన భారత ప్రభుత్వం అంతరాయానికి గల కారణాలు తెలపాలని వాట్సాప్‌ను ఆదేశించింది. సాంకేతిక సమస్యనా లేదా సైబర్ అటాక్ ఏదైనా జరిగిందా అనే కోణంలో వివరణ కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa