శ్రీశైలం ప్రాజెక్టు హెడ్రో ఎలక్ట్రికల్ డ్యాం నిర్మించి జూలై 2023తో 60 వసంతాలు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో పూర్వ విద్యార్థులంతా కలిసి వక్షోత్సవాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కూకట్ పల్లిలోని సివిల్ ఇంజినీరింగ్ సెమినార్ హాల్లో శ్రీశైలం ప్రాజెక్టు పూర్వ విద్యార్థుల సంఘం (ఎస్పీఓఎస్ఏ) ఈ నెల 30న సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. డ్యాం నిర్మాణం లో వర్క్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఏఈ, డీఈ, ఎస్ఈ లతో పాటు అనేక మంది కార్మికులు కృషి చేశారని పేర్కొన్నారు. వారందరినీ ఆహ్వానిస్తున్నట్లు పేర్కోన్నారు.