అచ్యుతాపురం మండలం కొండకర్ల జంక్షన్ సమీపంలో బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో సుమారు 20 మందికి స్వల్పగాయాలయ్యాయి. ముందువెళుతున్న బస్సును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా మరో బస్సు రావడంతో తప్పించే ప్రయత్నంలో ఆటో బోల్తాపడింది. బస్సు రోడ్డుప్రక్కకు దూసుకుపోయింది. ఈ ఘటనలో గాయపడిన కార్మికులను అంబులెన్సులో హాస్పటల్ కి తరలించారు. గాయపడిన వారంతా అచ్యుతాపురం సెజ్ లోని ఓ పరిశ్రమలో బి-షిఫ్టు విధులు ముగించుకొని వెళుతుండగా కొండకర్ల జంక్షన్ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అచ్యుతాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa