వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారి పరిపాలన మొదలవ్వడంతోనే తెలుగుదేశం పార్టీకి బీసీలు పూర్తిగా దూరమయ్యారు అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మీడియా తో అయన మాట్లాడుతూ... ఆ పార్టీ ప్రముఖ నాయకులంతా భయాన్ని లోపల దాచుకుని, బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిగారు ఆ సభకు ఎందుకు వచ్చారని, బీసీల సభతో ఆయనకు ఏం సంబంధం అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అసలు టీడీపీ నాయకులకు కనీస రాజకీయ పరిజ్ఞానం ఉందా? అని అడుగుతున్నాం. ఏదైనా రాజకీయ పార్టీలో ప్రధాన కార్యదర్శి ముఖ్య భూమిక పోషిస్తారు. ఆ సభ నిర్వహణలో తీసుకునే కీలక నిర్ణయాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు, బీసీల్లో ఉన్న ప్రముఖులతో ఇష్టగోష్టి నిర్వహించి సీఎం గారి ఆలోచనా విధానం ఏ విధంగా ఉందో బీసీ సదస్సులో వివరించడం జరిగింది అని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa