ఎస్ రాయవరం: మండలంలో లింగరాజుపాలెం లో కన్న తండ్రి చివరి రుణం తీర్చుకునేందుకు కుమార్తె అంత్యక్రియ నిర్వహించింది. గ్రామానికి చెందిన నాళం చిన్నబ్బాయి గురువారం రాత్రి ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. చిన్నబ్బాయికి మగపిల్లలు లేరు. కుమార్తెలు సునీత, మణి, విజయ ఉన్నారు. చిన్న కుమార్తె విజయ శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించింది.