వంకాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వంకాయలో పీచు, ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు, మాంగనీస్, ఫోలేట్, పొటాషియం ఉంటాయి కాబట్టి అవి మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వంకాయ చాలా సహాయపడుతుంది. ఇది గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వంకాయను తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్య తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి వంకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.