పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో టీడీపీ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. ఎన్టీఆర్ భవన్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. కోడెల శివరాం, వైవి ఆంజనేయులు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల బ్యానర్లను ధ్వంసం చేశారు. వెన్నాదేవి దగ్గర మల్టీ ఫ్లెక్సీలను చించివేశారు. ముగ్గురు నాయకుల ఫ్లెక్సీల ధ్వంసంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు.