మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందడానికి సీఎం జగన్ అండ్ బ్యాచ్ చూస్తోందని రాజధానికి 33వేల ఎకరాల భూములు త్యాగంచేసిన రైతులు పేర్కొన్నారు. బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న ఆందోళనలు శనివారం 1047వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి మూడు రాజధానుల పేరుతో అల్లరి చేయిస్తున్నారన్నారు. ప్రజలను రెచ్చగొడుతున్నారని, దానిని అర్థం చేసుకోవాలని విన్నవించారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగించారు. దీపాలు వెలిగించి బిల్డ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు.