సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన సందర్భంగా బీరం శ్రీధర్ రెడ్డి అంతర్జాతీయ పాఠశాలలో సోమవారం రాష్ట్రీయ ఏక్తా దివాస్ - యూనిటీ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బీరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ. రాష్ట్రీయ ఏక్తా దివాస్ యొక్క ప్రాముఖ్యతను, సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతీయ ఐక్యతకు చేసిన కృషిని గురించి వివరించారు. డైరెక్టర్ స్వాతి మాట్లాడుతూ. భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రి, మొదటి హోంశాఖ మంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కుల, మత, పేద మరియు ధనిక విభేదాలు లేకుండా వివిధ రాష్ట్రాల ప్రజలని ఐక్యతతో మెలగడానికి చేసిన కృషిని గురించి వివరించారు. ప్రిన్సిపల్ శ్వేత మాట్లాడుతూ. భారతదేశ ప్రజలు సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను గుర్తించి గత 8 సంవత్సరాలుగా ఈ రోజున రాష్ట్రీయ ఏక్తా దివాస్ ను నిర్వహించడం హర్షదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు అందరూ కలిసి యూనిటీ రన్ లో పాల్గొన్నారు.