భారత మొబైల్ మార్కెట్ లోకి పేరు మోసిన కంపెనీలు తమ నూతన ఉత్పత్తులు ఆవిష్కరించేందుకు సిద్దమవుతున్నాయి. ఇందులో భాగంగా నోకియా అభిమానులకు శుభవార్త. నోకియా జీ60 5జీ మోడల్ స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లో విడుదల కానుంది. ఇందుకు సంకేతంగా నోకియా ఇండియా పోర్టల్ లో ‘స్మార్ట్ ఫోన్ల’ విభాగంలో జీ60 ఉత్పత్తి, స్పెసిఫికేషన్ల వివరాలను అందుబాటులో ఉంచడం గమనార్హం. ఈ ఫోన్ కు ఓ ప్రత్యేకత ఉంది. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ తో దీన్ని తయారు చేశారు. ఫోన్ తయారీలో 60 శాతం రీసైకిల్ ప్లాస్టిక్ ను ఉపయోగించారు. ఫోన్ పై రెండేళ్ల వారంటీ, మూడేళ్ల పాటు అప్ డేట్స్ కు సంస్థ హామీ ఇస్తోంది.
6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ తో వస్తోంది. 6.58 అంగుళాల డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా 5 గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా, వెనుక భాగంలో 50 మెగాపిక్సల్, 5 మెగాపిక్సల్, 2 మెగాపిక్సల్ తో మూడు కెమెరాలు ఉన్నాయి. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వస్తుంది. 8.61 మందంతో వచ్చే ఈ ఫోన్ బరువు 190 గ్రాములు. ఈ ఫోన్ బ్లాక్, ఐస్ అనే రెండు రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ను నోకియా యూరప్ తదితర మార్కెట్లలో సెప్టెంబర్ లోనే విడుదల చేసింది. అక్కడ ధర రూ.26,000గా ఉంది. కానీ, భారత మార్కెట్లోరూ.20వేల లోపు ఖరారు చేయవచ్చని తెలుస్తోంది.